ముస్లిం రిజర్వేషన్లయితే అసెంబ్లీలో ఆమోదం ఎందుకు తెలిపారు?..కిషన్‌రెడ్డికి పొన్నం ప్రశ్న
బీజేపీ పార్టీ శాసన సభలో మద్దతు తెలిపారు..అప్పుడు బిల్లును ఎందుకు అడ్డుకోలేదు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముస్లింల పేరు మీద అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు..అని పొన్నం వ్యాఖ్యానించారు.
By Knakam Karthik
ముస్లిం రిజర్వేషన్లయితే అసెంబ్లీలో ఆమోదం ఎందుకు తెలిపారు?..కిషన్‌రెడ్డికి పొన్నం ప్రశ్న
రామజన్మభూమి ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవలేదని మంత్రి కొండా సురేఖ అడిగితే తప్పేంటని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ ,ఎస్టీ, బీసీ వర్గాల పట్ల ఏనాడు అయినా బీజేపీకి సానుభూతి ఉందా ? సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. కమండలం పేరు మీద నాటి సందర్భంలో బీజేపీ రిజర్వేషన్లు అడ్డుకుంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రపతిని కలవకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవాలని అపాయింట్‌మెంట్ కోరితే ఎందుకు కలవనివ్వడం లేదు?. బీజేపీ పార్టీ శాసన సభలో మద్దతు తెలిపారు..అప్పుడు బిల్లును ఎందుకు అడ్డుకోలేదు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముస్లింల పేరు మీద అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు..అని పొన్నం వ్యాఖ్యానించారు.
1971 నుంచే ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. రాతపూర్వకంగా కేంద్రమంత్రి హోదాలో లేఖ ఇవ్వండి మేము సపోర్ట్ చేయమని. రాష్ట్ర వ్యాప్తంగా డెడికేషన్ తో కమిటి వేసి సర్వే చేశాము. బీసీల నోటి దగ్గర కూడు తీసేయొద్దు. ఫ్యూడలిస్ట్ భావాలతో బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా బిజెపి వ్యవహరిస్తుంది. తెలంగాణ ఆకాంక్షను ఏ విధంగా సాధించామో, అదేవిధంగా బీసీ బిల్లు ఆమోదించుకుంటాము. జంతర్ మంతర్ లో నిన్న ధర్నాకు కులాల అతీతంగా మంత్రులు ,ఎమ్మెల్యేలు ,నేతలు పాల్గొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు మేము ఇవ్వడం లేదు. 10% రిజర్వేషన్లు పేరు చెప్పి రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్నారు. అసెంబ్లీ లో ఏకగ్రీవంగా తీర్మానం ఎందుకు ఆమోదం తెలిపారు..అని పొన్నం ప్రశ్నించారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా నాటి సందర్భంగా కిషన్ రెడ్డి ఉన్నారు ఆయన తెలియకుండానే ఆమోదం తెలిపారా ? కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కన్వర్టెడ్ కాంగ్రెస్ అంటే దానిలో ఏముంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఎంపీ అయ్యారు,ముఖ్యమంత్రి అయ్యారు తప్పేంటి ప్రజలు ఆమోదం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్నులొట్టపోయింది. బీజేపీ..చంద్రబాబు, నితీశ్ మద్దతుతో నడుస్తుంది. గతంలో కేంద్ర టూరిజం మంత్రిగా హైదరాబాద్‌కు కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చారు? కేంద్రం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో తెలంగాణకు అన్యాయం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏ ప్యాకేజ్ తీసుకొచ్చారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ కొరకు చర్యలు చేపట్టే విధంగా ప్రయత్నం చేయండి..అని పొన్నం పేర్కొన్నారు.