పదేళ్లు దోచుకుని ఇప్పుడు లబ్ధి చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు: మంత్రి పొన్నం

హైదరాబాద్: పది సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుంది..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

By -  Knakam Karthik
Published on : 23 Sept 2025 1:25 PM IST

Telangana, Minister Ponnam Prabhakar, Congress, Bjp, GST, Central Government

హైదరాబాద్: పది సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుంది..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగింది. జీఎస్టీతో పేదలకు లబ్ది చేసినట్టు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారు. GST అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటి నుండి చెప్తున్నాం. పేదలను దోచుకోవడానికి GST తెచ్చారు. శవ పేటికలపై, పసి పిల్లల తినుబండారాలపై కూడా GST వేశారు. GST ట్యాక్స్ తో ఏదైనా మంచిపని చేశారా? ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తెలంగాణకు 7 వేల కోట్ల నష్టం వస్తోంది. దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదే. తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రి సంజయ్, కిషన్ రెడ్డి లు తెలంగాణకి వస్తున్న నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పాలి. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అండగా ఉండాలి. జీఎస్టీ తెచ్చి పేదల నడ్డి విరిచింది మీరే, ఇప్పుడు తగ్గించింది మీరే. జీఎస్టీ తగ్గింపు అంత ఎన్నికల డ్రామా.. ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడి కి అందలేదు. జీఎస్టీ స్లాబుల పేరుతో ప్రతి వస్తువు మీద అదనపు పన్నులు వేసి పేదలు మోయలేని భారాన్ని చేశారు. జీఎస్టీ వచ్చి 8 సంవత్సరాలు అయింది.. 8 సంవత్సరాల తర్వాత ప్రజలకు ఇన్ని వేల కోట్లు ఆదా అవుతున్నాయని చెబుతున్నారు.. అంటే 8 సంవత్సరాలు మీరు ప్రజల రక్తం పీల్చుకు తిన్నట్టే కదా..అని పొన్నం విమర్శించారు.

మా నాయకుడు రాహుల్ గాంధీ మొదటి నుండి చెబుతున్నారు.. ఇది జిఎస్టి కాదు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని. ఇది సహేతుకంగా లేదు.. స్లాబులు కాదు రేట్లు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.. కాని కేంద్ర ప్రభుత్వ మాత్రం పెడచెవిన పెట్టింది. మీరు తెచ్చిన జీఎస్టీ లో 18,24 శాతలలో ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు చేర్చారు. పది సంవత్సరాలపాటు జీఎస్టీ రూపంలో దోచుకున్నారు. గడిచిన ఆరు మాసాల కాలంలో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడారు. దీనిని బట్టి జీఎస్టీ రూపంలో పిండేసి ఇప్పుడు వెన్నపూసినట్లుగా 5, 18 శాతం మాత్రమే పరిమితం చేస్తున్నట్లు చెప్తున్నారు. జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ అయ్యాయి. పెట్రోల్ ,డీజిల్ జీఎస్టీ లో చేర్చాలని తద్వారా పన్ను రేటు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేలేదు. మీరు శవ పేటికలకు కూడా జీఎస్టీ వేసారు శవాలను దహనం చేసే సమయంలో చెల్లించే సొమ్ముపై జీఎస్టీ తీసేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మీరు తగ్గించిన జీఎస్టీ ఫలాలు పేదోడి కి ఎంత వరకు అందుతాయో చూడాలి..అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.

Next Story