కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి,విధానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గత ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదన్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో అయినా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ మహా నగరంలో మరో ఇంటర్నేషనల్ కంపెనీ ఏర్పాటు కానుంది. ఇటలీ దేశానికి చెందిన డ్రిల్ మేక్ - తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎమ్‌వోయూ జరగనుండి. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిశ్రమల రాయితీలు అందించాలన్నారు.
తెలంగాణలోని ఫార్మాసిటీకి, కాకతీయ మెగా టెక్ట్స్‌టైల్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు రావాల్సిన నిధులు రాలేదన్నారు. ప్రధాని మోడీ ప్రతిసారి సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటున్నారని, రాష్ట్రాలకు నిధులు విడుదల చేయకపోతే అది ఎలా సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే.. ఇక్కడ వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రెండు తెలుగు రాష్రాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, తమ హక్కలు, డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చిన డ్రిల్మేక్‌కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.