కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు..రేపటి వరకు పనులు ఆపాలన్న ధర్మాసనం
కంచ గచ్చిబౌలి భూముల వేలంపై హెచ్‌సీయూ విద్యార్థులు, వట ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు సాగాయి.
By Knakam Karthik
కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు..రేపటి వరకు పనులు ఆపాలన్న ధర్మాసనం
హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూముల వేలంపై హెచ్‌సీయూ విద్యార్థులు, వట ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు సాగాయి. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. కంచ గచ్చిబౌలి భూముల్లో రేపటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కాగా కంచ గచ్చబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల తరపున ఎల్.రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. గత సంవత్సరం జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్‌ను టీజీఐఐసీకి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ అది గవర్నర్నమెంట్ ప్రాపర్టీ అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుందని.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కంచ గచ్చబౌలి భూముల దగ్గర భారీ మెషీన్లను ఉపయోగించి చెట్లను కొట్టివేసి, భూమిని చదును చేస్తున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ఫారెస్ట్ ఏరియాను కొట్టివేయాలంటే ఎక్స్‌పర్స్ట్ కమిటీ వేయాలి..అని హెచ్‌సీయూ తరపు లాయర్ వాదనలు వినిపించారు.
ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజ నిర్ధారణ నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ సమాచారం అందించింది. కోర్టు తీర్పులను పరిగణనలోకి ముందుకు వెళ్లాలని, ఫారెస్ట్ యాక్ట్‌కు లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్యురేట్ రిపోర్టు, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని పేర్కొంది.