Telangana Election Results: ఫస్ట్ రౌండ్.. ముందంజలో ఉన్నది వీరే
తెలంగాణలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు.
By అంజి Published on 3 Dec 2023 4:31 AM GMTTelangana Election Results: ఫస్ట్ రౌండ్.. ముందంజలో ఉన్నది వీరే
తెలంగాణలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. పలుచోట్ల మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడువుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. గజ్వేల్‌లో కేసీఆర్ - బీఆర్‌ఎస్, ఖమ్మంలో తుమ్మల - కాంగ్రెస్, గోషామహల్‌లో రాజాసింగ్ - బీజేపీ, అశ్వారావుపేటలో ఆదినారాయణ - కాంగ్రెస్, కామారెడ్డిలో రేవంత్ - కాంగ్రెస్, సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య - బీఆర్‌ఎస్, హుజుర్‌నగర్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి - కాంగ్రెస్, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ - బీఆర్‌ఎస్, తుంగతుర్తిలో శ్యామూల్ - కాంగ్రెస్, మధిరలో మల్లు భట్టి విక్రమార్క - కాంగ్రెస్, ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్ - బీజేపీ, భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి - కాంగ్రెస్, కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు - సీపీఐ, కోరుట్లలో సంజయ్ - బీఆర్‌ఎస్, సిద్దిపేటలో హరీశ్ రావు - బీఆర్‌ఎస్ ముందంజలో ఉన్నారు.
- సికింద్రాబాద్‌లో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుకు 3,309 ఓట్ల ఆధిక్యం..
- దుబ్బాకలో 3650 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
- కరీంనగర్‌లో 1,145 ఓట్ల ఆధిక్యంలో గంగుల కమలాకర్
- పఠాన్‌చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి 180 ఓట్ల ఆధిక్యం
- మలక్‌పేట్‌లో 1100 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి ముందంజ
- కంటోన్మెంట్‌లో ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత,
- హుజురాబాద్‌లో 1061 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కౌషిక్‌రెడ్డి
- రామగుండం నియోజకవర్గం లో 2వ రౌండ్ ముగిసే సరికి ఎం ఎస్ రాజ్ ఠాకూర్ (కాంగ్రెస్) 8399 ఓట్లతో ముందంజ
- హుస్నాబాద్ లో రెండో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ముందంజ