తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూయిజర్ కారు టైర్ పంక్చర్ కావడంతో కారు ఆగిపోవడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కొడంగల్‌లో మండలాలవారీగా కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కారు టైర్ పంక్చర్ అయింది.
ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ఉన్న ల్యాండ్ క్రూజర్ కారు టైరు పగలడంతో కాన్వాయ్ ఆగిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొడంగల్ వెళ్లే సమయంలో మన్నెగూడ దగ్గర కార్ టైర్ పగిలింది.