ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్..కీలక విజ్ఞప్తులు
ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
By Knakam Karthik
ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్..కీలక విజ్ఞప్తులు
ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సీఎం వెంట రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనను ఈ మీటింగ్ సందర్భంగా ప్రధానికి వివరించినట్లు సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను మోడీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా ప్రధానితో సమావేశం తర్వాత సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత, కులగణనతో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లులపై చర్చించారు. సెకండ్ ఫేజ్‌లో భాగంగా మెట్రో రైల్ కారిడార్ ను నగర శివారు ప్రాంతాలకు విస్తరించేందుకు చేపడుతోన్న డీపీఆర్‌ను ప్రధానికి సీఎం వివరించారు. అయితే, మెట్రో రైలును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించేందుకు ఇప్పటికే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు.