పెహల్గం ఉగ్రదాడికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషరెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. చేతికి నల్ల రిబ్బన్లు ధరించి జాతీయ జెండాలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోంది. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటనకు పరాకాష్ట. ప్రశాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ నిప్పులు పోస్తుంది. భారత్‌ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లే. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా అన్ని మండలాల్లో, బస్తీల్లో ప్రజలు నిరసనలు తెలియజేయాలి. మృతుల కుటుంబాలకు నిరసనలో సంతాపం వ్యక్తం చేయాలి.