హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్చి ఫ్యూచర్ సిటీకి ఆయన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని సీఎం రేవంత్ చూస్తున్నారని రామచందర్‌రావు ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు జిల్లాల పేర్లు మార్చి, నచ్చిన పేర్లు పెట్టుకుంటామంటే కుదరదు అని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నీటి రాజకీయాలు చేస్తున్నాయని టీబీజేపీ చీఫ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా ఉండాలని చెబుతున్న రేవంత్, సుప్రీంకోర్టుకు ఎందుకు పోయారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి అని రామచందర్ రావు అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అని రామచందర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నీటి వివాదాన్ని పరిస్కారం కావాలని లేదు, చంద్రబాబు కంటే రేవంత్ రెడ్డినే మోదీనే ఎక్కువ కలిశాడని రామచందర్ అన్నారు. కుటుంబ తగదాలతో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది..అని రామచందర్ రావు జోస్యం చెప్పారు.