తెలంగాణలో బీజేపీదే అధికారం.. నిశ్శబ్ద విప్లవం తప్పదు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది.

By Medi Samrat  Published on  20 Nov 2023 2:45 PM GMT
తెలంగాణలో బీజేపీదే అధికారం.. నిశ్శబ్ద విప్లవం తప్పదు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. ఇటీవల తెలంగాణ బీజేపీలో చోటు చేసుకున్న పలు సంఘటనల కారణంగా ఆ పార్టీలో కాస్త జోష్ తగ్గింది. అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అంటున్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, చాలా సెగ్మెంట్లలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన, మ్యానిఫెస్టో విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెలా మొదటి తారీఖును జీతాలు ఇస్తామని తెలిపారు. అంచనాలకు మించి క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల నుంచి బీజేపీకి ఆదరణ, మద్దతు లభిస్తోందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు.

దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తం తాగిందన్నారు కిషన్ రెడ్డి. ఎంతో మంది బలిదానానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ కు తెలంగాణలో చోటు లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. జల యజ్ఞం పేరుతో కాంగ్రెస్.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నారన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రచార రథాలను ఊళ్లలోకి రానివ్వడం లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్ కారు పోవడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకు ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో సమర్థవంతమైన డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

Next Story