బలహీన వర్గాలకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో, శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొంత మంది బలహీన వర్గాల మేధావులు, సంఘాల వారు ఏదో తప్పు జరిగినట్లుగా మాట్లాడుతున్నారని అని మండిపడ్డారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం చెప్పారు. కులగణన లెక్కల విషయంలో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడిక రావడానికి సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు.
కులగణనపై ఏమైనా అనుమానాలు ఉంటేక వాటిని నివృత్తి చేయడానికి సిద్ధమని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలకి కులాల లెక్కకు ఒక రూపం దొరికింది అన్నారు. మీడియా సమావేశాలు పెట్టి దయచేసి ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని మంత్రి పొన్నం కోరారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు అందించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ సర్వేను, నివేదికను స్వాగతించాలని మంత్రి పొన్నం తెలిపారు.