తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు డెసిషన్ తీసుకుంది. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. మరో వైపు బీసీ రిజర్వేషన్లపై కూడా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరపనుంది. ఈ క్రమంలో సభ్యుల సమావేశాల అనంతరం కాళేశ్వరంపై తదుపరి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు ఈ నెల 29న రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.