లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకున్న ఆరోపణలపై అసిస్టెంట్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 27 Jan 2025 8:30 PM ISTతెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకున్న ఆరోపణలపై అసిస్టెంట్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలోని కాళ్లకల్ సర్కిల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణ 63కేవీఏ థర్డ్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి కరెంటు ఇవ్వడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. కృష్ణ ఫిర్యాదుదారుడి నుంచి మొత్తం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. అందులో నుంచి రూ.10 వేలు ఇప్పటికే తీసుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు.
Ch. Krishna, Assistant Engineer, Kallakal Circle and Village, Manoharabad Mandal, Medak District was caught by Telangana #ACB Officials for demanding and accepting a #bribe amount of Rs. 20,000/- from the complainant "to release power supply by erecting 63KVA 3-phase DTR Under LT… pic.twitter.com/Z26on8tlGD
— ACB Telangana (@TelanganaACB) January 27, 2025
రెండో ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి టౌన్‌లో చోటు చేసుకుంది. 32వ వార్డు అధికారి నల్లంటి వినోద్ రేషన్‌కార్డు ప్రాసెస్ చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.2.500 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అరెస్టయిన వారి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను వరంగల్, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Nallanti Vinod, 32nd Ward Officer, Sathupalli Town of Khammam district was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.2,500/- from the complainant "to process ration card and Indiramma house sanction applications" in favour of the… pic.twitter.com/sVP9qN2Yon
— ACB Telangana (@TelanganaACB) January 27, 2025