కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

By Medi Samrat  Published on  11 Dec 2023 6:29 PM IST
కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. పలువురు టీడీపీ నేతలు చంద్రబాబుతో పాటూ ఉన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు జరిగిన తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతమైందని డాక్టర్లు చెప్పారని.. ఆయన కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని వివరించారని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు చంద్రబాబు.

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీమ్ ఆర్మీ అధినేత ఆజాద్ పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మళ్లీ ప్రజల్లో తిరగాలన్నారు.

Next Story