కోర్టులకు వెళ్లి మా నోటికాడి ముద్ద లాక్కోవద్దు: మంత్రి పొన్నం
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు
By - Knakam Karthik |
కోర్టులకు వెళ్లి మా నోటికాడి ముద్ద లాక్కోవద్దు: మంత్రి పొన్నం
హైదరాబాద్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ గారి 130వ జయంతి వేడుకల కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ..మా నాయకుడు రాహుల్ గాంధీ జిత్నే ఆబాది ఉతిని ఇస్తేదారి అని ఎవరితో వారికంత అని సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. తెలంగాణ కుల సర్వే నిర్వహించి దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు కూడా వెనుకడుగు వేయకుండా న్యాయపరంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దళితులకు ,గిరిజనులకు రాజ్యాంగపరంగా ఎంత రిజర్వేషన్లు ఉంటే అంత ఇస్తూ ..బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి పోతే ముందే కోర్టుకు వెళ్లారు. ఈరోజు, రేపు రిజర్వేషన్లపై జీవో వస్తుంది.. ఎన్నికలకు 42% రిజర్వేషన్లతో వెళ్లడానికి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రిజర్వేషన్ లు కాపాడుకునే బాధ్యత మనందరిదీ. 42 శాతం రిజర్వేషన్ల తో ఎన్నికలు జరిగితే రాజ్యాధికార దిశగా మనకు ఉన్నత స్థానాలు కలుగుతాయి. అవకాశం వస్తుంది ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు కొంత మంది అడ్డంపడితే ఎలా కొట్లాడి సాధించుకున్నాము.. ఈరోజు రిజర్వేషన్లు కాపాడుకోవడానికి మనమంతా ఐక్యంగా ఉద్యమించాలి..అని పొన్నం వ్యాఖ్యానించారు.
రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది..కాపాడుకునే బాధ్యత మీది. రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న కోర్టుకు వెళ్లేవారు మా నోటికాడి ముద్దను లాక్కోవద్దు. మేము ఎవరిది గుంజుకోవడం లేదు.. సామాజికంగా చట్టపరంగా పక్కన తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు ఇక్కడ కూడా అర్హత ప్రకారం ఇవ్వాలని కోరుతున్నాం. రిజర్వేషన్లు కాపాడుకునే బాధ్యత మనందరిది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం పరిధిలో జరిగే ఎన్నికల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు. ఎవరైనా అడ్డం వస్తె సామ దాన భేద రెండు చేతులు జోడిస్తున్న..లేదంటే తెలంగాణ ఉద్యమ సమయంలో యూనివర్సిటీకి వ్యతిరేకంగా వెళితే వీపు చింతపండు అయింది. మిమ్మల్ని కోరుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చారిత్రాత్మక పునాది. రిజర్వేషన్లు అమలు అయితే మన సమస్యలన్నీ నెరవేరుతాయి. విగ్రహం వస్తుంది, నిధులు వస్తాయి, ఉపాధి కల్పన జరుగుతుంది. రాజకీయం ఎవరి బిక్ష కాదు... గ్రామాల్లో మన పరపతి పెంచుకొని విజయం సాధించాలి. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సభలో చర్చించి 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ..అని పొన్నం మాట్లాడారు.