శ్రీలంక వాణిజ్యం, పర్యావరణ శాఖ మంత్రి సదాశివం వియలేంద్రన్ భారతదేశ పర్యటన సందర్భంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావును కలిశారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుండి హైదరాబాద్ సాధించిన వేగవంతమైన అభివృద్ధిని కొనియాడారు. కేవలం 10 ఏళ్లలో రాష్ట్రం సాధించిన గొప్ప విజయాలను, తెలంగాణ ప్రగతిని శ్రీలంక పార్లమెంట్‌లో తాను ప్రస్తావించినట్లు వియలేంద్రన్ తెలిపారు. ఈ సమావేశంలో సదాశివం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి చుట్టూ జరుగుతున్న అభివృద్ధిని సింగపూర్‌తో పోల్చారు. తెలంగాణను పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా మార్చడంలో ఐటీ, పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ పాత్రను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం ఆందోళనకరంగా ఉండగా, బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌ను అవకాశాల కేంద్రంగా మార్చడం అందరికీ స్ఫూర్తిదాయకమని వియలేంద్రన్ ప్రశంసించారు.
శ్రీలంక మంత్రి వ్యాఖ్యలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌లో ఉత్పత్తి అయిన సంపదను బలహీన వర్గాలకు పునఃపంపిణీ చేశామని వివరించారు. “కేవలం పదేళ్లలో మనం ఎంత ముందుకు వచ్చామో గర్వంగా ఉంది. హైదరాబాద్‌ను అవకాశాల హబ్‌గా మార్చడంలో మా కృషిని గుర్తించినందుకు మంత్రి సదాశివంకు కృతజ్ఞతలు. మేము సంపదను సృష్టించడమే కాకుండా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా బలహీనులకు పునర్విభజనచేశాం, ”అని కేటీఆర్ X లో ఒక పోస్ట్ పెట్టారు.