'ఒకే గదిలో అమ్మాయిలు-అబ్బాయిలు'.. కాంగ్రెస్ సీనియర్ నేత గుస్సా..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, సమాచార సాంకేతిక మంత్రి డి.శ్రీధర్ బాబుకు కీలక సూచనలు చేసారు.

By Medi Samrat
Published on : 26 Jun 2025 9:56 AM IST

ఒకే గదిలో అమ్మాయిలు-అబ్బాయిలు.. కాంగ్రెస్ సీనియర్ నేత గుస్సా..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, సమాచార సాంకేతిక మంత్రి డి.శ్రీధర్ బాబుకు కీలక సూచనలు చేసారు. హైటెక్ సిటీలోని 'కో లివింగ్' హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హాస్టల్స్‌ను పురుషులు, మహిళలు ఇద్దరికీ అద్దెకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఒకే గదిలో అమ్మాయి-అబ్బాయి కలిసి వుండేందుకు అనుమతి ఇవ్వడం ఇదెక్కడ న్యాయమని హనుమంత రావు ప్రశ్నించారు. ఒకవైపు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతుంటే ఇలా కో లివింగ్ స్పేసెస్ అంటూ ఇచ్చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి వుండటం ఏంటండీ.. ఇది వరకు చక్కగా ఉమెన్స్ హాస్టల్స్, మెన్ హాస్టల్స్ వేర్వేరుగా వుండేవన్నారు. దేశంలో హైదరాబాద్ నెం. 1 నగరంగా వుండాలంటే ఇలాంటివన్నీ లేకుండా చూడాలంటూ సూచించారు.

Next Story