కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. నగరంలోని నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్‌ అధికారులు సీఆర్‌పీసీ 160 కింద కేసీఆర్‌ పీఏకు నోటీసులు అందించారు.

By -  అంజి
Published on : 29 Jan 2026 1:50 PM IST

SIT, notice, KCR, phone tapping case, Hyderabad

కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. నగరంలోని నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్‌ అధికారులు సీఆర్‌పీసీ 160 కింద కేసీఆర్‌ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 65 సంవత్సరాలకు పైగా వయస్సు ఉండటంతో పోలీస్‌స్టేషన్‌కు రావడం తప్పనిసరి కాదని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు రావాలి అనుకుంటే రావచ్చు లేదా హైదరాబాద్‌ పరిధిలో ఆయన కోరిన చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా 'బిగ్‌ బాస్' ఆదేశాలతోనే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామన్న నాటి అధికారుల స్టేట్‌మెంట్ల ఆధారంగా కీలక నేతలను సిట్‌ విచారిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులతో ఫోన్‌ ట్యాపింగ్ కేసు సంచలన మలుపు తిరిగింది.

అప్పటి ప్రభుత్వాధినేత కేసీఆరే కావడంతో సిట్‌ ఆయయను ఎలాంటి ప్రశ్నలు అడగనుంది, కేసీఆర్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌కు సిట్‌ నోటీసులతో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ట్యాపింగ్‌ జరిగిందన్న ప్రభుత్వం రెండేళ్లుగా విచారణ జరుపుతోంది. తొలుత ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు చుట్టే తిరిగింది. ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో దర్యాప్తు నెమ్మదించింది. ఎట్టకేలకు ప్రభాకరావును విదేశాల నుంచి రప్పించి సుదీర్ఘంగా విచారించారు. ఆయన స్టేట్‌మెంట్ల ఆధారంగా నాటి కీలక నేతలపై సిట్‌ ఫోకస్‌ పెట్టింది.

Next Story