పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని వైఎస్ షర్మిల సూచించారు. ఈ మేరకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్ధామని ఇరువురు నేతలతో ఫోన్‌లో చర్చించారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్ధామని సూచించారు. కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని.. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బ్రతకనివ్వరని ఇరువురు నేతలతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో సమావేశం అవుదామని షర్మిలతో చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి బండి సంజయ్ పూర్తి మద్దతు తెలిపారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని.. ఉమ్మడి పోరాటంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని షర్మిలతో చెప్పినట్లు సమాచారం.