ఆసిఫాబాద్ లో హై టెన్షన్
సెప్టెంబర్ 4న ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఉద్రిక్తత చెలరేగింది.
By Medi Samrat Published on 4 Sep 2024 11:21 AM GMTసెప్టెంబర్ 4న ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఉద్రిక్తత చెలరేగింది. జిల్లాలో ఓ గిరిజన మహిళపై ఆటో రిక్షా డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన హింసాత్మకంగా మారింది. ఇది మతాల మధ్య దాడులకు కారణం అయింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కొన్ని వీడియోలలో ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న విజువల్స్ ను మనం చూడవచ్చు.
ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై జరిగిన అత్యాచార సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆదివాసి సంఘాలు అత్యాచార సంఘటనను నిరసిస్తూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ బందుకు పిలుపుని ఇచ్చారు. ఉద్రిక్త పరిస్థితుల్లో స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి పొరుగు మండలాలు, ప్రధాన కార్యాలయాల నుండి బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.