ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్లకూ డెడ్‌లైన్ విధించాలి: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు.

By Knakam Karthik
Published on : 13 April 2025 11:44 AM IST

Telangana, Brs, Ktr, Congress Government, Supreme Court

ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్లకూ డెడ్‌లైన్ విధించాలి: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిని స్వాగతిస్తూనే కేటీఆర్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌లకు డెడ్‌లైన్ విధించాలని సుప్రీంకోర్టును కోరారు. పాలనలో అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ లెక్కలేనన్న సార్లు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలకు అసెంబ్లీ స్పీకర్లకు కూడా గడువు విధించాలని సుప్రీంకోర్టును కేటీఆర్ కోరారు.

కాగా, రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదం కోసం గవర్నర్లు తీవ్ర జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. గరిష్టంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, వెనక్కి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులు వెనక్కి పంపితే అందుకు సహేతుకమైన కారణాన్ని రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది.

Next Story