ఓ వైపు పట్నం నరేందర్ రెడ్డికి ఊరట.. మరోవైపు లొంగిపోయిన ప్రధాన నిందితుడు

లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది

By Medi Samrat  Published on  19 Nov 2024 6:44 PM IST
ఓ వైపు పట్నం నరేందర్ రెడ్డికి ఊరట.. మరోవైపు లొంగిపోయిన ప్రధాన నిందితుడు

లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది. ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా అనుమతించింది. నరేందర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయాలనే పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. సురేష్ ను కొండగల్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. వికారాబాద్ జిల్లా కొండగల్ మండలంలోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన అధికారులపై గ్రామస్తులు, రైతులు దాడి చేసిన ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి తో పాటు సురేష్ కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు ఆరోపించారు.

Next Story