తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ తరగతులు జరపనున్నారు. అయితే కరోనా గత నిబంధనలనే స్కూళ్లలో అమలు చేయనున్నారు. గత సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 8వ తేదీ నుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో సెలవులను జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది ప్రభుత్వం. రెండు రోజుల కిందట మళ్లీ స్కూళ్లు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లు.. భౌతికంగా తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
యూనివర్సిటీలు కూడా నేటి నుండి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో మాత్రం సీబీఎస్‌ఈ స్కూళ్లను రేపటి నుండి ప్రారంభిస్తామి తల్లిదండ్రులకు ఇనఫర్మేషన్ ఇచ్చింది. అలాగే మరికొద్ది రోజుల పాటు ఆన్‌లైన్ క్లాసులు జరగనున్నాయి. టీశాట్ విద్యా ఛానెల్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి.. అయితే టీవీ పాఠాలకు సంబంధించిన ఎలాంటి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేయలేదు. నేడు కూడా ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయో లేదో అధికారులు తేల్చలేదు. మరోవైపు ఈ విద్యా సంవత్సరాన్న మే చివరాఖరు వరకు పొడిగించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.