రేపటి నుంచి అమల్లోకి 4 కొత్త పథకాలు..అనర్హులకు లబ్ధి చేకూరిస్తే చర్యలు తప్పవని సర్కార్ వార్నింగ్

తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి నాలుగు కొత్త సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురానుంది.

By Knakam Karthik
Published on : 25 Jan 2025 2:25 PM IST

Telangana, Cm Revanth, Bhatti Vikramarka, congress, Bjp, Brs,

రేపటి నుంచి అమల్లోకి 4 కొత్త పథకాలు..అనర్హులకు లబ్ధి చేకూరిస్తే చర్యలు తప్పవని సర్కార్ వార్నింగ్

తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి నాలుగు కొత్త సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను రేపటి నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని అన్నారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని మండలాల పరిధిలో ఒక్క గ్రామాన్ని నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మార్చి 31వ తేదీ లోపు పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story