కమాండ్ కంట్రోల్ నుంచి పాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? రేవంత్‌పై హరీష్‌రావు విమర్శలు
సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 12:34 PM IST
కమాండ్ కంట్రోల్ నుంచి పాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? రేవంత్‌పై హరీష్‌రావు విమర్శలు
సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రజా పాలన అంటూ, సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటూ ప్రతి రోజు ప్రజలను కలుస్తా అంటూ.. ఏదాడి కాలంగా ముఖం చాటేస్తివి అని ఎద్దేవా చేశారు. అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన కొనసాగుతుందని విమర్శించారు. పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రభుత్వ నిర్ణయాలు జరుగుతున్నాయని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అంటూ హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన..పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రభుత్వ నిర్ణయాలు..ప్రజా పాలన అంటివి,సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి,ప్రతి రోజూ…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 29, 2025
సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖల విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని.. మంత్రులు, అధికారులను మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నారని సీఎం అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉంటున్నారని విమర్శించారు. మంత్రులు, అధికారులను ప్యాలెస్‌కు పిలిపించుకుని, అహంభావం ప్రదర్శిస్తున్నావంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.