చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల‌లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు

By Medi Samrat  Published on  4 Jun 2024 8:32 PM IST
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల‌లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. “రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిద్దాం. సమస్యలను పరిష్కరించుకుందాం. అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం' అని రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. టీడీపీ 134, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో దాదాపుగా విజ‌యం సాధించారు. అధికార పార్టీ వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ప్రస్తుతం కేవలం 12 సీట్లకే ప‌రిమిత‌మైంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది.

Next Story