రావిర్యాల ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ‌లో రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Revanth Reddy Sensational Comments. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో రావిర్యాల వేదిక‌గా బుధ‌వారం ద‌ళిత గిరిజ‌న దండోరా మ‌హ‌స‌భ జ‌రిగింది

By Medi Samrat  Published on  18 Aug 2021 10:33 PM IST
రావిర్యాల ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ‌లో రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో రావిర్యాల వేదిక‌గా బుధ‌వారం ద‌ళిత గిరిజ‌న దండోరా మ‌హ‌స‌భ జ‌రిగింది. స‌భ‌కు హాజ‌రైన పీసీసీ అధ్యక్షుడు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి అడుగు ఇంద్రవెళ్లి, రెండో అడుగు రావిరాలలో.. మూడో అడుగు కేసీఆర్ నెత్తిన పెట్టి తొక్కుతామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌లో వర్షం శుభసూచికమ‌ని.. కాంగ్రెస్ ను ఆశీర్వదించడానికి వరుణుడు వచ్చాడని అన్నారు. తెలంగాణలో సచ్చింది ఎవరు? తెలంగాణ వచ్చాక సంపదను దోచుకుంటున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలని రేవంత్ వ్యాఖ్యానించారు.


కేసీఆర్ ఎంగిలిమెతుకలకు తెలంగాణ బిడ్డలు సిద్ధంగా లేరని.. ప్రజల దుఃఖం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు తెలుసన‌ని రేవంత్ అన్నారు. చదువుకుంటే ప్రశ్నిస్తారని ఆ వర్గాలను చదువులకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. కేకే మహేందర్ రెడ్డి కష్టపడితే ఆయనకు ద్రోహం చేసి కేటీఆర్ కు టికెట్ ఇచ్చారని.. చంద్రబాబును బతిమాలుకుని కేటీఆర్ గెలిచారని అన్నారు. దళిత బిడ్డ ప్రదీప్ చంద్రను సీఎస్ గా ఒక్క నెలకే ఎందుకు రిటైర్ చేశార‌ని ప్ర‌శ్నించారు. దొర దగ్గర బానిసలుగా పనిచేయలేక ఐఏఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాలకు మురళీ, ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారని.. ఇవాళ‌ రాహుల్ బొజ్జను సీఎంవో లో పెట్టుకుంటే కేసీఆర్ ను ఎవరు నమ్ముతారని అన్నారు. హుజురాబాద్ లో ఓట్లు అవసరం కాబట్టే బయటకు వచ్చారని.. బయటకు వచ్చిన దొంగను బండకేసి కొట్టాలని రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు.


Next Story