టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మై హోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డిపై రూ.90 కోట్లకు మై హోం రామేశ్వర్ రావు ఈ పరువు నష్టం దావా వేశారు. సీఎం కేసీఆర్ అండదండలతో హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ ఆరోపణల వల్ల సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడిందని, అందుకు రూ.90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు కేసు నిరాధారమైనదని భావించి కొట్టివేసింది. ఈ ఆరోపణలు చేసిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు.
సీఎం కేసీఆర్ అండదండలతో హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల వల్ల సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడిందని, అందుకు రూ.90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు కేసు నిరాధారమైనదని భావించి కొట్టివేసింది.