రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పేరు మార్చి ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుగా నామకరణం చేయడం దారుణమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇది బీజేపీ, మోదీ పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. యువకులను అన్ని రంగాలలో ప్రోత్సహించి.. దేశంలో క్రీడా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ పేరును ఖేల్ రత్నగా ఉండటం సముచితమని అన్నారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని.. చిల్లర రాజకీయాలు మార్చుకొని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కొనసాగించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే.. క్రీడాకారులకు ఇచ్చే అత్యత్తమ పురస్కారం 'రాజీవ్ ఖేల్‌రత్న' పేరును మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రాజీవ్ ఖేల్‌రత్న పేరును 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న' అవార్డుగా మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాలని తనకు దేశవ్యాప్తంగా పౌరుల నుంచి అనేక వినతులు అందాయని ఈ సందర్భంగా మోదీ ట్విటర్‌లో వెల్లడించారు. వాళ్ల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఖేల్‌రత్న అవార్డు పేరును 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న' అవార్డుగా మారుస్తున్నట్లు ట్వీటులో పేర్కొన్నారు.