కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టలేదు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Fires On KCR And Modi Over Petrol Price Hike. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పేదల నుంచి రూ. 36 లక్షల కోట్లు
By Medi Samrat Published on 16 July 2021 10:03 AM GMT
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పేదల నుంచి రూ. 36 లక్షల కోట్లు దోపిడీ చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆందోళనలు చేపడుతోంది. ఈ ఆందోళనల్లో భాగంగా శక్రవారం నాడు 'చలో రాజ్‌భవన్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ, కేడీ ఇద్దరు ప్రజలను జలగళ్ల పీల్చుకుంటున్నారని.. వారికి బుద్ధి చెప్పడానికే ధర్నా చేపట్టామన్నారు.
కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టలేదని.. నిజాం దవాఖానలో మందులు వేసుకుంటూ పడుకున్నాడని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏపీలో పార్టీని చంపుకుని.. తెలంగాణ ఇచ్చిందని.. రక్తం కాంగ్రెస్ ది, చావు కాంగ్రెస్ ది.. కేసీఆర్ మోసం చేసి రెండు సార్లు సీఎం అయ్యారని ఫైర్ అయ్యారు.
పేదల సొమ్ము దోచుకుంటున్న మోడీ, కేసీఆర్ ను దొంగలు అనాలా.. లేక గజ దొంగలు అనాలా.. అని ప్రశ్నించారు. దొంగలున్నారు జాగ్రత్త అని మోడీ, కేసీఆర్ ఫోటోలు పెట్రోల్ బంకుల్లో పెట్టాలని చెప్పారు. కేసీఆర్, మోడీ దోపిడీపై గ్రామాల్లో చర్చ పెట్టాలని.. పెట్రోల్ ధరలో 65 రూపాయలు మోడీ, కేసీఆర్ దోచుకుంటున్నారని అన్నారు. మన పక్కనున్న ఏ దేశంలో పెట్రోల్ మీద ఇంత పన్ను లేదని రేవంత్ రెడ్డి అన్నారు.