టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా పోరాడండి.. లేదంటే రాజీనామా చేయండి

Revanth Reddy Fires On Govt. కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన

By Medi Samrat  Published on  8 Aug 2021 3:59 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా పోరాడండి.. లేదంటే రాజీనామా చేయండి

కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంద్రవెల్లి కేంద్రంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో కార్య‌క్ర‌మం విజయవంతం చేయడంపై పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి నివాసంలో భేటీ అయి చ‌ర్చించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులకు సంబంధించిన సమీక్ష జరిగిందని అన్నారు. రేపు జరగబోయే ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నామ‌న్నారు.

ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికే దళిత బంధు పతకాన్ని తెచ్చారని ఆదివాసీలకు, గిరిజనుల‌కు విజ్ఞప్తి చేస్తున్నామ‌ని.. అంటే ప్రభుత్వం ఏదైనా పథ‌కం తీసుకురావాలంటే ఉపఎన్నికలు రావాలని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ శాస‌న‌స‌భ్యులు స్థానిక ద‌ళిత‌, గిరిజ‌న సోద‌రుల‌కు ప‌ది ల‌క్ష‌లు ఇప్పించే విధంగా పోరాడాల‌ని.. లేదంటే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇస్తవా-చస్తవా అనే నినాదంతో ప్రభుత్వంపై ప్రజల తరపున కొట్లాడుతుంద‌న్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ దళిత, గిరిజన, ఆదివాసీలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు సెప్టెంబర్ మొదటి వారంలో జ‌రిగే కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరవుతార‌ని రేవంత్ అన్నారు.


Next Story