కేటీఆర్‌ పేరే టీడీపీది.. గజ్వేల్‌లో నైనా పోటీ చేస్తా : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On CM KCR. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లో చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్‌ అవినీతికి తావులేద

By Medi Samrat  Published on  27 Aug 2021 6:15 PM IST
కేటీఆర్‌ పేరే టీడీపీది.. గజ్వేల్‌లో నైనా పోటీ చేస్తా : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లో చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్‌ అవినీతికి తావులేదని అన్నార‌ని.. అవినీతికి ఎవరు పాల్ప‌డ్డా చర్యలు తీసుకుంటామన్నారని.. రాజయ్య మీద ఆరోపణలు వస్తే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారు.. ఈటల రాజేందర్ మీద అసైన్డ్ భూములు ఆక్రమించారని భర్తరఫ్ చేశారు.. దేవరయంజాల్ లో దేవుని భూములు ఆక్రమించారని ఐఏఎస్ ల కమిటీ వేశారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇస్తున్న.. 50 ఎకరాలలో లేఅవుట్ వేస్తే.. మామూళ్లు ఇవ్వాలని బహిరంగంగా వసూలు చేశారని.. సీఎం కేసీఆర్ ఈ అక్రమాలపై ఎందుకు విచారణ జ‌రిపించ‌డం లేదని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని.. గుండ్లపోచంపల్లిలో సర్వేనెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే. ఈ భూమి ఒక్కసారిగా ధరణి పోర్టల్ కు వచ్చేసరికి 33 ఎకరాల 26 గుంటలుగా మారింద‌ని అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి అనుమతులు ఎలా వచ్చాయి.. భూ బాగోతం మాయ ఏంటి? అని ప్ర‌శ్నించారు. జవహర్ నగర్ మున్సిపాలిటీలో సర్వేనెంబర్ 488 లో 5 ఎకరాల భూమి.. ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్ శాఖ నిషేధం లో ఉంచిందని.. ఇదే సర్వేనెంబర్ లో సీఎంఆర్ మెడికల్ కాలేజ్ ఎలా ఏర్పాటు అయ్యిందని.. ప్రభుత్వ భూమిని మంత్రి కబ్జా చేస్తే కనపడటం లేదా అని ఫైర్ అయ్యారు. పచ్చిదొంగలను కేసీఆర్ ప్రొత్సహిస్తున్నారు విమ‌ర్శ‌లు చేశారు. దత్తత పేరుతో గ్రామాలను తీసుకొని.. ఫాంహౌస్ కు రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తే.. ప్రతిపక్షం తరపున ప్రశ్నించే హక్కు లేదా అని ప్ర‌శ్నించారు.

మూడు గ్రామాల్లో ఇచ్చిన హామీలను సీఎం హోదాలో కూడా అమలు చేయలేదని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారని.. సమస్యను పక్కదారి పట్టించేందుకు చిల్లర వేషాలు వేస్తున్నారని అన్నారు. తిట్ల పోటీ పెట్టుకుందామంటే మేం రెడీ.. ప్రగతి భవన్ కు లేదా ఫాంహౌస్ కు రమ్మన్నా వస్తామ‌ని.. మల్లారెడ్డి అవినీతిని కేటీఆర్, కేసీఆర్ సమర్థిస్తున్నారా..? అని ప్ర‌శ్నించారు. 2019లో నేను గెలించిందే మల్లారెడ్డి మీదేన‌ని.. కేసీఆర్‌ రాజీనామా చేసి వచ్చినా.. గజ్వేల్‌లో పోటీ చేస్తాన‌ని రేవంత్ అన్నారు. చేతనైతే ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికల్లోకి రండి.. మేమేంటో మా బలం ఏంటో చూపిస్తామ‌ని స‌వాల్ విసిరారు. చంద్రబాబు చెప్పులు మోసి బతికింది కేసీఆర్ అని.. కేటీఆర్‌ పేరే టీడీపీది అని రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.


Next Story