Revanth Reddy Fire On Govt. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆందోళనలు చేపడుతోంది
By Medi Samrat Published on 16 July 2021 7:07 AM GMT
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆందోళనలు చేపడుతోంది. ఈ ఆందోళనల్లో భాగంగా శక్రవారం నాడు 'చలో రాజ్‌భవన్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది రాష్ట్ర నాయకత్వం. అయితే.. చలో రాజ్‌భవన్ కు వెళ్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు పోలీసులు.
ఈ విషయమై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేము శాంతియుతంగా నిరసన చేస్తామని.. ధర్నాచౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలి అని డిమాడ్ చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు వెంటనే విడిచిపెట్టాలని.. అరెస్టులు, నిర్బంధాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని అన్నారు. శాంతియుత నిరసనలను ఇలా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చిఆందోళన నిర్వహిస్తారని రేవంత్ హెచ్చరించారు. అరెస్టులతో నిరసన కార్యక్రమం ఆగదని.. కొనసాగుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై పన్నులను పెంచుతూ సామాన్యులను దోపిడీ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.