నిబంధనలు ఉల్లంఘించి సీఎం కేసీఆర్ ఇస్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నామినేషన్ వేసిన పత్రాలను ఏ రోజుకు ఆరోజు ఆన్ లైన్ లో పెట్టాలని కోరారు. నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ లో పెట్టడం ద్వారా.. అభ్యర్థులు ఏవైనా తప్పుడు సమాచారం ఇస్తే.. ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నామినేషన్ పత్రాల వివరాలు ఇవ్వాలని అడిగితే.. రిటర్నింగ్ అధికారి స్పందించడం లేదని.. ఎన్నికల అధికారులు టిఆర్ఎస్ కు సహాకరిస్తున్నారని ఆరోపించారు. మాజీ కలెక్టర్ వెంకట్రమిరెడ్డిపై ఫిర్యాదు చేసామని.. మాకు నామినేషన్ పత్రాల పరిశీలనకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.
నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని.. టిఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని.. దీనిపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని రేవంత్ అన్నారు. ఎన్నికల అధికారులు సరైన విధంగా స్పందించకపోతే.. న్యాయస్థానం తలుపుతడుతామని తెలిపారు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని.. చాలా ఆరోపణలు, ఫిర్యాదులు వెంకట్రమిరెడ్డి ఎదుర్కొంటున్నారని.. డీవోపీటీ ఆమోదించిన తర్వాతే.. వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారిని కోరామని రేవంత్ అన్నారు. ఎన్నికల అధికారులు సమాచారాన్ని దాచి పెడుతున్నట్లుగా స్పష్టంగా కనపడుతుందని ఆరోపించారు.