బీజేపీ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేశారు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాత, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 12-13 స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  15 May 2024 9:40 AM IST
బీజేపీ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేశారు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాత, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 12-13 స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పని అయిపోయిందని, 6-7 నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కవని ఆయన అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేశారని కూడా ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి డి.నాగేందర్ 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని జోస్యం చెప్పారు.

తెలంగాణలో బీజేపీ వేవ్ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ నియోజక వర్గంలో బీజేపీ తృతీయ స్థానంలో నిలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశం లేదని.. హైదరాబాద్‌ను రెండో దేశ రాజధానిగా చేస్తే రాష్ట్ర ఆదాయానికి గండి పడదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు.. సమాధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయిన వారితో కలిసి పని చేస్తానని చెప్పారు. తనకు ఎవరితోనూ సమస్య ఉండదని, తెలంగాణ ప్రయోజనాలే తనకు ప్రధానమని స్పష్టం చేశారు.

Next Story