తెలంగాణ సమాజం రాహుల్‌కు అండగా నిలబడింది

Revanth Reddy About Bharat Jodo Yatra. మరో మూడు రోజుల్లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుండడటంతో కార్యాచరణపై నిజాం

By Medi Samrat  Published on  4 Nov 2022 1:53 PM IST
తెలంగాణ సమాజం రాహుల్‌కు అండగా నిలబడింది

మరో మూడు రోజుల్లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుండడటంతో కార్యాచరణపై నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీలో సమీక్షా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క షబ్బీర్ అలీ, ఏఐసీసీ నేత బోసురాజు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రోహిత్ చౌదరి, ఆర్.దామోదర్ రెడ్డి ఇతర నేతలు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో యాత్ర విజవంతం చేయడంతో పాటు 7న జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు.

అనంత‌రం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే మూడు రోజులు అత్యంత కీలకం.. మక్తల్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సమాజం రాహుల్ కు అండగా నిలబడిందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జోడో యాత్ర తెలంగాణకు వచ్చింది. అయినా యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ నెల 5, 6న మాత్రమే పాదయాత్ర కొనసాగుతుంది. 5న సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుంది. 6న ఎలాంటి కార్నర్ మీటింగ్ ఉండదు. 7న వీడ్కోలు సమావేశం అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉందని నేత‌ల‌తో అన్నారు.

7న‌ భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదు. ఈ నెల 7న రాత్రి సమయంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది. రాత్రి 9.30కు దెగ్లూరులో మహారాష్ట్ర వారికి పరిచయం చేయబోతున్నాం. 4 గంట‌ల‌ నుంచి 6 గంట‌ల‌లోపే బహింరంగ సభను నిర్వహించుకోవాలని.. నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాల నాయకులు.. ఈ మూడు రోజులు క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు.

రాహుల్ యాత్ర కవరేజీ కాకుండా కుట్రలు చేసినా మీడియా మంచి కవరేజ్ ఇచ్చింది. జర్నలిస్టులకు కూడా చాలా అన్యాయం జరిగింది. జర్నలిస్టు సంఘాల నాయకులకు కూడా రాహుల్ తో ప్రత్యేక సమయం కల్పిస్తాం. వారి సమస్యలను రాహుల్ కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వెల్ల‌డించారు.


Next Story