తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావుకు రిలీఫ్

మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది

By Knakam Karthik
Published on : 10 Jun 2025 11:18 AM IST

Telangana, High Court, Harishrao, Brs, Chakradhar Goud

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావుకు రిలీఫ్

మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన గెలుపు చెల్లదంటూ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో ఉన్న.. ప్రస్తుత కాంగ్రెస్ చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో హరీష్ రావు తప్పుడు సమాచారాన్ని సమర్పించారని ఆయన ఎన్నికపై అనర్హత వేటు వేయాలని న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం విచారించిన ధర్మాసనం సరైన ఆధారాలు లేకపోవడంతో చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

Next Story