ఎంఐఎం చెప్పిన వ్యక్తే గోషామ‌హ‌ల్ బీఆర్ఎస్‌ అభ్యర్థి : రాజాసింగ్

బీఆర్ఎస్ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

By Medi Samrat  Published on  21 Aug 2023 7:25 PM IST
ఎంఐఎం చెప్పిన వ్యక్తే గోషామ‌హ‌ల్ బీఆర్ఎస్‌ అభ్యర్థి : రాజాసింగ్

బీఆర్ఎస్ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. గోషామ‌హ‌ల్ టికెట్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై బీఆర్ఎస్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎంఐఎం చేతిలో గోషామహల్ బీఆర్ఎస్‌ టికెట్ ఉంద‌ని ఆరోపించారు. గోషామహల్ అభ్యర్థిని ఫైనల్ చేసేది.. సీఎం కేసీఆర్‌ కాదు.. ఎంఐఎం అధినేత అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంఐఎం చెప్పిన వ్యక్తినే బీఆర్ఎస్‌ అభ్యర్థిగా ఫైనల్ చేస్తారని అన్నారు. గతంలో పోటీచేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కూడా ఎంఐఎం రిఫర్ చేసిన అభ్యర్ధేన‌ని అన్నారు. బీజేపీ అభ్యర్థి నేనే అని అన్నారు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. ఛాలెంజ్ చేస్తున్నా.. గెట్ రెడీ గోశామహల్ కార్యకర్తలారా.. యుద్ధం మొదలుపెడదామ‌ని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని పీకేద్దాం.. బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొద్దామ‌న్నారు.

Next Story