బంగాళాఖాతంలో బ‌ల‌ప‌డిన అల్ప‌పీడ‌నం.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అల‌ర్ట్‌..!

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on  25 Nov 2024 9:07 AM IST
బంగాళాఖాతంలో బ‌ల‌ప‌డిన అల్ప‌పీడ‌నం.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అల‌ర్ట్‌..!

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‌పీడ‌నం బలపడుతోందని, ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా త‌మిళ‌నాడు, శ్రీ‌లంక వైపు క‌దులుతూ వాయుగుండంగా మారే అవ‌కాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి కొనసాగే అవకాశం ఉందని.. ఈ నేప‌థ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గత కొద్దిరోజులుగా పొగ మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పుడు వర్షాల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చలి తగ్గే అవకాశం ఉంది.

Next Story