Video : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు

By Medi Samrat
Published on : 5 Nov 2024 6:00 PM IST

Video : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లిలో కుల గణన సమావేశానికి హాజరవుతారు.

మొత్తం జనాభా సామాజిక-ఆర్థిక, కుల వివరాలను అంచనా వేయడానికి నవంబర్ 6 నుండి సమగ్ర సర్వే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లల్లోని సభ్యుల వివరాలు, వారి కులం, ఉపకుల స్థితి, ఆర్థిక స్థితి, రాజకీయ ప్రాతినిధ్యం, ఇతర అంశాలను వాలంటీర్లు తెలుసుకోనున్నారు.


Next Story