తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోంది.. కానీ.. : రాహుల్ గాంధీ
బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు.
By Medi Samrat Published on 18 Oct 2023 7:54 PM ISTబీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు.ములుగు రామానుజపురం సభలో ఆయన మాట్లాడుతూ.. మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ.. ఇలా ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రాజస్థాన్ లో ఆరోగ్య పథకం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఛత్తీస్ గడ్ లో వారి ధాన్యాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరి ధాన్యానికి ఛత్తీస్ గడ్ లో ఎక్కివ ధర చెల్లించి కొంటున్నామని వెల్లడించారు.
కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేసి చూపిందన్నారు. రాష్ట్రంలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మేం ఏ మాట ఇచ్చామో అది నిబెట్టుకున్నాం.. తెలంగాణలోనూ మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపుతామన్నారు. దేశంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని.. వీరికి ఎంఐఎం మద్దతు ఇస్తోందన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.