తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు కచ్చితంగా కేంద్రం పేరు పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మీ నిధులతో అమలవుతోన్న సంక్షేమ పథకాలకు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా? ఒసామా బిన్‌లాడెన్ పెట్టుకుంటారా, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. నిధులేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఫొటోలకు ఫోజు ఇచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేస్తుందని ఎద్దేవా చేశారు. బియ్యం కేంద్రం ఇస్తుంటే, ఫొటో మీది పెట్టుకుంటారా అంటూ అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తోందన్న ఆయన, కేంద్ర ప్రభుత్వ పేర్లను మార్చితే నేరుగా లబ్దిదారులతో ఎలా ఇవ్వాలో ఆలోచన చేస్తామన్నారు. సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆపదని స్పష్టం చేశారు.