ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు.. రేపు రెండు గ్యారెంటీలు ప్రారంభిస్తారా.?

తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. తెలంగాణ రాష్ట్రానికి ఫిబ్రవరి 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రావాల్సి ఉంది.

By Medi Samrat  Published on  26 Feb 2024 4:07 PM IST
ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు.. రేపు రెండు గ్యారెంటీలు ప్రారంభిస్తారా.?

తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. తెలంగాణ రాష్ట్రానికి ఫిబ్రవరి 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రావాల్సి ఉంది. చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు షెడ్యూల్​ ఖరారు చేశారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించాలని రేవంత్​ సర్కార్​ నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె టూర్​ అనివార్య కారణాలతో రద్దయింది.

సీఎం రేవంత్​ రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రెండు గ్యారంటీలను అమలుచేయనున్నారు. కొన్ని కారణాల వల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్ద అయ్యిందని.. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించినట్లుగానే మంగళవారమే రెండు గ్యారంటీలను ప్రారంభించేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Next Story