కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు తీరుతాయి : ప్రియాంక గాంధీ

ఆదివాసీ సమాజం కొసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను పెట్టిందని ప్రియాంక గాంధీ అన్నారు

By Medi Samrat  Published on  19 Nov 2023 1:39 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు తీరుతాయి : ప్రియాంక గాంధీ

ఆదివాసీ సమాజం కొసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను పెట్టిందని ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు పక్కా పట్టాలను ఇచ్చింద‌ని తెలిపారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 సంవత్సారాలు అవుతున్నా ఆమె అందరి మదిలో ఉన్నారని అన్నారు. ఇందిరా గాంధీ చేసిన మంచి పనులే ఆమెని మీకు దగ్గర చేశాయని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన అధికారాన్ని అంతే బాధ్యతగా కాంగ్రెస్ నిర్వహించిందన్నారు.

తెలంగాణా ప్రజల ఇబ్బందులు చూసి సోనియా గాంధీ స్వరాష్ట్రం ఇచ్చార‌ని అన్నారు. ఇచ్చిన‌ తెలంగాణను కేసీఆర్ ఆగం చేసారని విమ‌ర్శించారు. తెలంగాణ ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్ర‌మే ఉద్యోగాలు వచ్చాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల ఆత్మహ‌త్యలు పెరిగాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కుటుంబంలో ఓ ఉద్యోగం వస్తద‌న్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు తీరుతాయన్నారు. ధరణి పోర్టల్ తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని రకాల పంట దాన్యం ధరలు పెంచి రైతులను ఆదుకుంటామన్నారు. వ్యాపార వేత్తలకు భారీ రుణ మాపీలను చేసారు.. రైతులకు చేయలేద‌న్నారు.

తెలంగాణ రైతులు, రైతు కూలీలు, కార్మికులు అందరికీ అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తప్పులను బీజేపీ ప్రశ్నించదు. కేసీఆర్‌, బీజేపీ రెండూ ఒక్కటే.. ప్రజలు గమనించాలన్నారు. రైతుల నల్ల చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారని.. తెలంగాణ లో బీజేపీ సపోర్ట్ చేస్తే.. ఢిల్లీలో బీఅర్ఎస్ సపోర్ట్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళల కోసం ప్రత్యేక పథకాలను తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. క్రికెట్ వర‌ల్డ్ కప్ ఉన్నప్ప‌టికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story