మరోసారి తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన

By Medi Samrat  Published on  8 Nov 2023 8:15 PM IST
మరోసారి తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ఇటీవలే ఆయన పాల్గొన్నారు. నాలుగు రోజుల్లోనే మళ్లీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 11వ తేదీన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే మాదిగల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు.

నవంబర్ 11న సాయంత్రం గం.4.45 నిమిషాలకు మోదీ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 5 గంటలకు రోడ్డు మార్గంలో పరేడ్ మైదానంకు చేరుకుంటారు. 5 నుంచి 5.45 వరకు పరేడ్ మైదానంలో సభలో ఆయన ప్రసంగిస్తారు. 5.55 నిమిషాలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, 6 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. వారం వ్యవధిలో రెండు సార్లు ప్రధాని మోదీ హైదరాబాద్ కు రావడం విశేషం. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.!

Next Story