రేపటి టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం వాయిదా

రేపటి టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఎల్లుండికి వాయిదా ప‌డింద‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

By Medi Samrat  Published on  22 Dec 2023 5:16 PM IST
రేపటి టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం వాయిదా

శనివారం జరగాల్సిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఎల్లుండికి వాయిదా ప‌డింద‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం.. ఇందిరా భవన్ లో జరుగుతుందని తెలియ‌జేశారు. పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ చైర్మన్ లు ఈ స‌మావేశంలో పాల్గొంటారని వెల్ల‌డించారు.

టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు ఈ స‌మావేశంలో పాల్గొంటారని వెల్ల‌డించారు. 12.30 గంట‌ల‌కు టీపీసీసీ మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కార్యవర్గాల సమావేశం ప్రకాశం హాలులో జరుగుతుందని తెలిపారు.

Next Story