కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

By Medi Samrat
Published on : 24 March 2025 9:32 PM IST

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, కిషోర్ గౌడ్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.

బండి సంజయ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించి ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ నోట్లనే పంచారని చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ మీద ఫిర్యాదు చేస్తున్నారు. బీదర్​లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పాంప్లెంట్స్ కాకుండా దొంగనోట్లు ముద్రించారని మంత్రి బండి సంజయ్ తెలిపారు. గతంలో సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఆఫీసర్ తనకు ఈ విషయం చెప్పారన్నారు. ఆ ప్రెస్​ను సీజ్ చేసేందుకు ఆయన వెళ్తుంటే.. రాష్ట్రంలోని ముఖ్యనాయకుడు ఫోన్ చేసి ఆపినట్టు ఆయన చెప్పారని తెలిపారు. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగనోట్లేనని, అప్పుడు ఆ నోట్లు ఎలా చెల్లాయో తనకు తెలీదన్నారు బండి సంజయ్.

Next Story