హైడ్రాను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ నగరంలో హైడ్రా పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ ప‌రిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తూ దూసుకుపోతుంది

By Medi Samrat  Published on  14 Sept 2024 8:45 AM IST
హైడ్రాను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ నగరంలో హైడ్రా పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ ప‌రిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తూ దూసుకుపోతుంది. కొంత మంది దీనిని స‌పోర్టు చేస్తుండ‌గా.. హైడ్రా పేదల కోసమే అని.. బడా బాబుల కోసం కాదనే విమర్శలు కూడా వ‌స్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లైంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉత్తర్వు (GO) 99ని సవాల్ చేస్తూ హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. GHMC చట్టాన్ని దాటవేసి అధికారులు హైడ్రాను ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తూ హైడ్రా చట్టపరమైన చెల్లుబాటును కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోపణలపై స్పందించేందుకు ప్రభుత్వానికి గడువు ఇస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Next Story