బేగంపేట విమానాశ్రయంలో ఆగిపోయిన పవన్ కళ్యాణ్ విమానం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పట్నంకు వెళ్లాల్సిన ప్రత్యేక విమానం రద్దయింది.
By Medi Samrat
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పట్నంకు వెళ్లాల్సిన ప్రత్యేక విమానం రద్దయింది. బేగంపేట విమానాశ్రయంలోనే ఆయన విమానం ఆగిపోయింది. అయితే వైసీపీ ప్రభుత్వమే కుట్ర పూరితంగా పవన్ పర్యటనను అడ్డుకుందని జనసేన ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ రావాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఉందంటూ ఓ సీఐడీ అధికారి చెప్పడంతో.. ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని ఆపేసినట్టు తమకు సమాచారం వచ్చిందని జనసేన నేత కేవీఎస్ఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకంత భయం @ysjagan
— JanaSena Shatagni (@JSPShatagniTeam) November 24, 2023
ఈ రోజు మధ్యాహ్నం విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లను నష్టపోయిన మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు బయలుదేరిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని రాకుండా అడ్డుకునేందుకు చిల్లర వేషాలు వేస్తున్న @YSRCParty ప్రభుత్వం.… pic.twitter.com/mrlyKgPenV
పవన్ కళ్యాణ్ మరో విమానంలో విశాఖపట్నంకు వస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. విశాఖ విమానాశ్రయం నుంచి ఫిషింగ్ హార్బర్ కు చేరుకొని బోట్లు దగ్ధం అయిన ప్రదేశం పరిశీలిస్తారు. అనంతరం బోట్ల యజమానులను పరామర్శించి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు.