బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు కొనసాగించొచ్చని తెలిపింది. ఇక పోలీసులకు సహకరించాలని కౌశిక్ రెడ్డికి సూచించింది. క్వారీ యజమాని మనోజ్‌ను 50లక్షల ఇవ్వాలంటూ బెదిరించాడని కౌశిక్‌పై కేసు నమోదు అయింది. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టును కౌశిక్ రెడ్డి ఆశ్రయించారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారన్న కౌశిక్ రెడ్డి న్యాయవాది. కౌశిక్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది హైకోర్టు.